Site icon NTV Telugu

Komatireddy: కేసీఆర్‌తో కొట్లాటే నా విధానం.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ.. !

సీఎం కేసీఆర్‌తో కొట్లాడాలనేదే తన విధానమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఈ పార్టీ అవుతుందనుకుంటే ఇక్కడే ఉంటానని లేదంటే మరో పార్టీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఎవరు కొట్లడితే వాళ్లతో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.. ఇక, తనకు బాధ్యత అప్పగిస్తే.. పదిమందిని గెలిపిస్తానని చెప్పారు. అదే సమయంలో నాకు పదవి కూడా అక్కర లేదన్న ఆయన.. పది మందిని గెలిపించూ అని బాధ్యత ఇస్తే గెలిపిస్తా అన్నారు… మరోవైపు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ తనతో బాగానే ఉన్నారని చెప్పారు రాజగోపాల్‌ రెడ్డి. రేవంత్‌ను తానే కాంగ్రెస్‌లోకి రమ్మని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందన్నారు. తామంటే గిట్టనివారు కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్య గ్యాప్‌ ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలే ఈ పని చేస్తున్నారని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

Read Also: Congress: రెండు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్..! రేపే రెబల్స్‌ భేటీ..

Exit mobile version