సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదంటూ అందరికి షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. ఒకవేళ క్యాడర్ వద్దంటే, తన సతీమణి నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో.. జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈనేపథ్యంలో.. ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు.
దీంతో.. సొంత పార్టీలో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఆయన నోరెత్తడం లేదు. కొద్దిరోజులుగా జగ్గారెడ్డి గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. అయితే.. జగ్గారెడ్డి అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. గతంలో.. 2014 ఎన్నికల్లో ఓడిపోయి.. జగ్గారెడ్డి 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. జగ్గారెడ్డి తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపిస్తూ.. ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ఇక, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన జగ్గారెడ్డి పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లినా.. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. మరి జగ్గారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ వర్గాల్లో మళ్లీ ఎలాంటి మార్పునకు దారితీస్తాయో వేచి చూడాలి.
