Site icon NTV Telugu

Mallu Ravi: కేసీఆర్ దళిత వ్యతిరేకి.. మల్లు రవి ధ్వజం

Mallu Ravi On Kcr

Mallu Ravi On Kcr

Congress Leaker Mallu Ravi Fires On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. భారతదేశం అంతా ఒక కుటుంబమేనని రాజ్యాంగం చెబుతుందన్నారు. అంబేద్కర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీతో కలిపి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రాయించిందని, రిజర్వేషన్‌లు కల్పించిందని గుర్తు చేశారు. రిజర్వేషన్‌లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే అసలైన దళిత బంధు అని పేర్కొన్నారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు పెట్టింది? ఎంత కారిఫార్వర్డ్ చేసింది? అని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు ఖర్చు పెట్టని బీఆర్ఎస్ పార్టీ ఎలా దళిత బంధు అవుతుందని నిలదీశారు. సబ్ ప్లాన్ నిధులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తే.. సీఎం కేసీఆర్ బంధువో, రాబందువో తెలుస్తోందన్నారు.

Ponguleti Srinivasa Reddy: రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వను

అంబేద్కర్ పెద్ద విగ్రహం పెట్టినంత మాత్రాన సీఎం కేసీఆర్ దళిత బంధు కారని.. సొంత డబ్బుతో విగ్రహం పెట్టారా? అని మల్లు రవి నిలదీశారు. ప్రజల సొమ్ముతోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో చట్టాలను తీసుకొచ్చిందన్నారు. 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి, కేసీఆర్ వాటిని పార్టీ నాయకులకు అప్పగించి.. దళితులకి అందులో చదివే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న ఆయన.. రిజర్వేషన్ ప్రకారం 22% అంటే 44 వేల ఉద్యోగాలు రావాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టగానే.. కేసీఆర్ మంచివాడు అయిపోయాడనేది తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. తాము అంబేద్కర్ వారసులమేనని, ఆయన ఆలోచనలకు తామే వారసులమని తెలిపారు. ప్రకాష్ అంబేద్కర్ దీనిపై సమాధానం చెప్పాలని, కేసీఆర్ దళితులకు చేసిన అన్యాయం గురించి ఆయన మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ని ప్రకాష్ అంబేద్కర్ పొగడటం దళితులకు అవమానమని, దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరారు.

RCB vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Exit mobile version