Site icon NTV Telugu

కాంగ్రెస్‌లో అంతే.. పాస్‌ల కోసం గాంధీ భ‌వ‌న్‌లో ఫైటింగ్..!

ఓవైపు కొత్త‌గా పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రేవంత్ రెడ్డి.. పార్టీ శ్రేణుల్లో నూత‌న ఉత్సాహాన్ని నింపుతూ.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ ముందుకు సాగుతుంటూ.. మ‌రోవైపు.. మా పార్టీ ఇంతే.. ఎవ‌రో అవ‌స‌రం లేదు.. మేం మేమే త‌న్నుకుంటూం.. మేం మేమే చూసుకుంటాం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.. ఇవాళ గాంధీ భవన్‌లో పాస్ ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్లాట‌కు దిగారు.. తాము చాలా సీనియర్ నేతలం మాకు పాస్ లు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్లకు ఎలా ఇస్తారంటూ నిరంజన్, గంట సత్యనారాయణ గొడ‌వ‌కు దిగారు.. టీడీపీ నుండి నిన్న మొన్న వచ్చినోడు మా మీద పెత్తనం చేస్తాడా? అంటూ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేత‌లు.. అంతేకాదు.. ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్ వ‌చ్చాకే పార్టీ అంతా ఓటమి పాల‌వుతుంద‌ని.. వెంట‌నే ఆయ‌ను తొల‌గించాలంటూ డిమాండ్ చేశారు. కాగా, ఇవాళ రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రావిరాల వేదిక‌గా.. కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Exit mobile version