NTV Telugu Site icon

Congress Leaders Arrested: కరీంనగర్‌ లో ఉద్రిక్తత.. బండిసంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

Kareemnagar Congress

Kareemnagar Congress

Congress leaders arrested in Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కరీంనగర్ సభ నేపథ్యంలో బండి సంజయ్ కు వ్యతిరేకంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేసావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా అక్కడికి చేరుకుని ప్రతిగా బీజేపీ నాయకుల నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారు. బీజేపీ నేతలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. మమ్మల్ని అదుపులో తీసుకుని వారిని ఎందుకు వదులుతున్నారు అంటూ మండిపడ్డారు. బలవంతంగా మమల్ని ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు వాగ్వాదం జరిగితే ఒకరినే పోలీసులు టార్గెట్‌ చేయడం ఏంటిన మండిపడ్డారు. బీజేపీకి పోలీసులు మద్దతు పలకడం ఏంటిన ప్రశ్నించారు కాంగ్రెస్‌నాయకులు.

Read also: Gidugu RudraRaju: కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని సీపీఐని కోరా

తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభమైన పాదయాత్ర 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర సాగింది. ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఐదో విడత ప్రజా పోరాట యాత్ర నేడు కరీంనగర్‌లో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ముగింపు సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఎటువంటి ఉద్రికత్త చోటుచేసుకోకుండా కరీంనగర్‌ ను పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్

Show comments