V.Hanumantharao: సోనియాగాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని నియోజకవర్గాలపై పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని, భారత్ కూటమిని గెలిపిస్తామని వీహెచ్ స్పష్టం చేశారు.
Read also: IND vs SA: సిరాజ్ హిందీకి బుమ్రా అనువాదం.. వీడియో వైరల్!
బీఆర్ఎస్ నేతలకు పనిలేక 420 బుక్ లెట్ తో కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని గెలిపెంచారని స్పష్టం చేశారు. పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నిరవేర్చారో ప్రజలకు చెప్పాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవరుస్తుందని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు ముడు ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగ హామీలు నెరవేర్చలేకపోయారన్నారు.
Shiva Sena Reddy: నోరు అదుపులో పెట్టుకోండి.. రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయి..