హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది.. అయితే, ఈ హత్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. ఈ కేసులో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వామన్‌రావు దంపతుల హత్య ముమ్మాటికే ప్రభుత్వ హత్యగానే విమర్శించారు.. సుప్రీంకోర్టులో వామన్‌రావుపై తెలంగాణ ప్రభుత్వమే కేసు వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రవణ్.. ఇక, ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదని కేటీఆర్ ఒప్పుకున్నారు.. ఉద్యోగాలు నింపలేదు అని కేటీఆర్ చెప్పడాన్ని మేం స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత.. అయితే, లక్షా 90 వేల ఉద్యోగాలు ఎందుకు నింపలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు నింపకుండా ఎవరైనా మీకు అడ్డుపడరా? అని ప్రశ్నించిన ఆయన.. మీ అసమర్ధతకు ఇది నిదర్శనం కాదా? విద్య, వైద్యం, ఉపాధిరంగం.. ఇలాంటివి పక్కన పెట్టి ఈ ఏడు సంవత్సరాలు ఎం చేసారు? అంటూ ఫైర్ అయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ ఉద్యోగాలు పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భర్తీ చేశారని గుర్తుచేసిన శ్రవణ్… మీరు డీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే.. కొర్పారేట్ విద్యావ్యవస్థల ఆగడాలు తగ్గేవి కదా అన్నారు.. సింగరేణి, విద్యుత్ రంగం, పంచాయితీల్లో ఉద్యోగాల భర్తీ అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.. ఇక, ఐటీఐఆర్ కోసం అవసరమైతే 13 వేల కోట్ల అప్పు చేదాం.. ఐటీఐఆర్ కోసం కేంద్రం మీద మా ఎంపీలతో యుద్ధం చేద్దాం.. మా ఎంపీలు, మా రాహుల్ గాంధీ వస్తారు అని సవాల్ చేశారు. మేడిన్ తెలంగాణ అన్నది రాహుల్ గాంధీ కలగా చెప్పిన శ్రవణ్.. యానిమేషన్ అండ్ గేమింగ్ ని ఎందుకు పక్కకి పెట్టారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని మోడీ చెప్పారు.. మరి మీరు ఎందుకు స్కిల్ డెవలప్‌మెంట్ చేయడం లేదు.. యువతకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.