Site icon NTV Telugu

కేసీఆర్ దోపిడీని బయటపెడతాం.. ఆయన శేషజీవితం జైల్లోనే..!

Ponnala

Ponnala

తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్‌ దోపిడీని బయటపెడతామని.. అయన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందేనని వ్యాఖ్యానించారు.. ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన ఆయన.. శిశుపాలుడి పాపాల కంటే కేసీఆర్‌ పాపాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారు.. తప్పుడు సమాచారం ఇచ్చే సన్నాసిని మాత్రం నేను కానని.. మీరే కాదు.. మీ ఇంజనీర్లు కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చూపించాలని సవాల్ విసిరారు.. సన్నాసులు మాత్రమే ఇలా అబద్ధాలు చెబుతారు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు… ప్రాజెక్టుల వద్ద సెక్యూరిటీ పెట్టి సెంటిమెంట్‌ మొదలు పెట్టారని మండిపడ్డారు పొన్నాల.. నీళ్ల కేటాయింపులు 50 శాతం ఇవ్వాలి అని కేసీఆర్ ఇప్పుడు అడుగుతున్నారు.. 50 శాతం వాటా కావాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ఆమోదంతోనే ప్రాజెక్టు కడుతున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ప్రకటన చేశారు.. కానీ, కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version