Site icon NTV Telugu

హుజురాబాద్‌.. టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి కుమారుడు

Kashyap Reddy

Kashyap Reddy

ఈటెల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తిష్టవేసి పావులు కదుపుతున్నారు.. ఈ సమయంలో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు ముద్దసాని కశ్యప్ రెడ్డి.. ఇవాళ గులాబీ పార్టీ గూటికి చేరారు.. ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయనకు పేరుంది… వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన కశ్యప్ రెడ్డి.. కాసేపటి క్రితం.. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సుపరిపాలన అందిస్తున్నారని.. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంది.. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.. త్వరలో హూజూరాబాద్ లో జరిగే మీటింగ్‌లో వందలాది మంది కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతారని.. వచ్చే ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌.. టీఆర్ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ విజయం సాధించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతామని వెల్లడించారు.

Exit mobile version