Site icon NTV Telugu

ఈటల వ్యక్తిత్వం కోల్పోయారు : జీవన్ రెడ్డి

ఈటల.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతా అని బీజేపీలో చేరడం ఎంటో అర్దం కావడం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. తెరాస అవినీతికి రక్షణగా నిలిచింది బీజేపీ. ఈటల బీజేపీలో కలుస్తారని నేను ఊహించలేదు. ఆయన బలహీనత బయట పడింది. ఈటల బీజేపీలో చేరుతూ తన వ్యక్తిత్వం కోల్పోయారు. ఇక కాంగ్రెస్ నీ ఎవడో నడపడు. కాంగ్రెస్ నీ నడిపిస్తుంది రాహుల్ గాంధీ. ఈటల స్థాయిని స్వయంగా ఆయనే తగ్గించుకున్నారు. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడు. పీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీ నాయకుడికే ఇస్తారు. బయట పార్టీ వాళ్లకు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు. అయితే చూడాలి మరి జీవన్ రెడ్డి వ్యాఖ్యల పై ఈటల ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Exit mobile version