Site icon NTV Telugu

Jairam Ramesh: కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడు..

Jairam Ramesh

Jairam Ramesh

కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్‌ విమర్శించారు. తెలంగాణ ప్రకటన సమయంలో కేసీఆర్ అసలు పార్లమెంటులోనే లేరని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నల్గొండ జిల్లా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు, యువతకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.

Also Read: Priyanka Gandhi: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక ప్రసంగం

ప్రజలు తెలంగాణ ఇస్తే… ఒక్క కేసిఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, కేసీఆసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. సెక్రెట్రెరియట్‌కి రాని ఏకైక సీఎం కేసిఆర్ అన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని, ఆరు గ్యారంటీలు ఒక వ్యక్తివి కావు.. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అని పేర్కొన్నారు. డిసెంబర్ 3 తరువాత తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ పాలనే అని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, భర్తీలో BRS పూర్తిగా విఫలమైందన్నారు.

Also Read: DK Shivakumar: కేసీఆర్, కేటీఆర్‌లను ఓడించి పర్మినెంట్‌గా ఫాంహౌజ్‌కి పంపండి

ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు BRS మరియు MIM కలిసి ఉన్నాయని, ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. భారీ ప్రాజెక్టులు నిర్మించినా.. కాంగ్రెస్ అవినీతికి పాల్పడలేదని, ఓకే ఒక్క ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించిన BRS వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అంబాసిడర్ కారు ఎప్పుడో తెరమరుగు అయ్యిందని, ఏసీలో కూర్చుని ఉద్యమాలు చేస్తే… నష్టం జరుగుతుందని తెలిసి కాంగ్రెస్ కఠిన నిర్ణయం తీసుకుందని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

Exit mobile version