NTV Telugu Site icon

Geetha Reddy: పబ్స్‌కి, డ్రగ్స్‌కి హైదరాబాద్ హబ్‌గా మారింది

Geetha

Geetha

తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచార ఘటన కేసు రోజు రోజుకు విచిత్రంగా మారుతోందన్నారు. రాజకీయ నాయకుల పిల్లలను కాపాడాలని పోలీసులు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా మూడు రోజుల వరకు ఎందుకు పట్టించుకోలేదని గీతారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పబ్స్ కి , డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. అసలు పబ్స్ కి అనుమతులు ఉన్నాయా అంటూ ఆమె ప్రశ్నించారు. 2014లో మద్యంతో 10 వేల కోట్ల ఆదాయం ఉంటే.. ఇప్పుడు 34 వేల కోట్ల అదాయం వస్తోందన్నారు.

మైనర్ రేప్ కేసు విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు , వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కొడుకు ఉన్నారని ఆమె అన్నారు. నిందితుడు దుబాయ్ వెళ్తే ఏ విధంగా వెళ్లాడని ప్రశ్నించారు. ఎవరినో కాపాడటానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాపాడాలని చూస్తున్నారని ఆరోపించారు. అమ్మాయి వీడియో రిలీజ్ చేసి ఆ కుటుంబం బయట తిరగకుండా చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటయ్యాయన్నారు. న్యాయవాదిగా పని చేసే రఘునందన్ రావుకు ఆడ బిడ్డలు లేరా.. ఆయనపై కూడా కేసు పెట్టాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Errabelli Dayakar Rao: కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు.. వాళ్లవ‌ల్లే ధ‌ర‌లు పెరిగాయి

న్యాయవాది వామనరావు దంపతులను రోడ్డుపై నరికి చంపేస్తే చర్యలు లేవని ధ్వజమెత్తారు. తాము ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేయడానికే పనికొస్తారని.. నిందితులని పట్టుకోవడానికి పని చేయరన్నారు. ఎంఐఎం నాయకులతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు పరిచయాలు ఉన్నాయని గీతారెడ్డి ఆరోపించారు.