Bhatti Vikramarka: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మంత్రి హారీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్ ఆస్పత్రిలో జరిగిన సంఘటనను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖను వదిలేసి భజన శాఖను తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని అడిగి హరీష్ రావు భజన శాఖను తీసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజామాబాద్ ఆసుపత్రిలో పేషెంట్లు స్ట్రేచర్లు లేక కాళ్లు పట్టుకుని గుంజుకుపోవాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు.
Read Also: NASA: అంగారకుడిపై ఎగిరిన బుల్లి హెలికాప్టర్.. వీడియో..
సెర్ఫ్ ను బీఆర్ఎస్ చంపేస్తోందని ఆరోపించారు. సెర్ఫ్ కు ఫుల్ ఫామ్ కూడా తెలియని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హాయాంలో మహిళలు రూపాయి కోసం ఎక్కడా ఇబ్బంది పడలేదని, డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలు అప్పులు ఇచ్చే పరిస్థితి తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. పెన్షన్ స్కీంను ఎత్తేశారని, తొమ్మిదన్నరేళ్లుగా ప్రజల్ని రాచిరంపాన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని కేసీఆర్ దెబ్బతీశారని విమర్శించారు.
మహిళలతో సభ పెట్టి హరీష్ రావు సీఎం భజన చేశారని, హరీష్ రావు నువ్వు చెబితే భజన చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని, ఢిల్లీలోనే కాదు లిక్కర్ స్కాం తెలంగాణలో కూడా జరిగినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. దేశమంతా లిక్కర్ స్కాం ఆశ్చర్యపోయేలా చేసింది, ఢిల్లీలో తెలంగాణ మోడల్ లిక్కర్ పాలసీ అన్నప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా స్కాం జరిగినట్లే కదా అని అన్నారు. మిషన్ భగీరథ స్కామ్ రాష్ట్రంలో బయటకు వస్తుందని అన్నారు.
