Site icon NTV Telugu

Congress: కీలక నిర్ణయం.. నియామక ప్రక్రియకు స్వస్తి..!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… ఇప్పటి వరకు పార్టీలో ఉన్న నియామక ప్రక్రియకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది… ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్‌ ఠాగూర్‌ అధ్యక్షతన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది… సభ్యత్వ నమోదుపై కీలకంగా చర్చించారు పార్టీ నేతలు.. మరోవైపు, పార్టీ ఎన్నికల నియమావళిని కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్‌ పార్టీ… గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ఎన్నికలే నిర్వహించాలని నిర్ణయించింది… ఇప్పటి వరకు ఉన్న నియామక ప్రక్రియకు స్వస్తి చెప్పబోతోంది… సాధారణ ఎన్నికల మాదిరిగానే నామినేషన్… పార్టీలో ఎన్నికలు నిర్వహించనున్నారు.. డీసీసీల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ ఠాగూర్.. ఇప్పటి వరకు ఉన్న నియామక అధికారాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ.

Read Also: AP Special Status: అది పొరపాటున చేర్చారు.. ఇప్పుడు లేదు..!

Exit mobile version