NTV Telugu Site icon

పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట…

Congress

Congress

జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఏఐసిసి పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ పెరుగుదలకు నిరసనగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ చౌరాస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై నిరసన తెలిపుతున్న తరుణంలో వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొద్ధిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసారు పోలీసులు.