Site icon NTV Telugu

Congratulations to Team India KCR: టీమిండియాకు సీఎం కేసీఆర్ అభినందనలు

Congratulations To Team India Kcr

Congratulations To Team India Kcr

Congratulations to Team India KCR: హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాను సీఎం కేసీఆర్ అభినందించారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత జట్టు గెలుపొందడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా, మ్యాచ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 21 టీ20ల్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. ఓపెనర్లు రాహుల్ (1), రోహిత్ (17) ఇద్దరూ నిరాశపరిచినా విరాట్ కోహ్లీ (63), సూర్యకుమార్ యాదవ్ (69) హాఫ్ సెంచరీలు చేయడంతో టీమిండియా గెలుపు దిశగా దూసుకెళ్లింది. చివర్లో హార్దిక్ పాండ్యా (25 నాటౌట్) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో శామ్స్ 2 వికెట్లు తీయగా హేజిల్‌వుడ్, కమిన్స్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామెరూన్ గ్రీన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొత్తం 52 పరుగులు చేసి వెనుతిరిగాడు. టిమ్ డేవిడ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version