హైదారాబాద్‌లోని డీఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు జాయిన్ అయినప్పటి నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన దిగారు. అయితే.. ఎనిమిది నెలలుగా తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్‌కు స్టైఫండ్ అందలేదని ఆందోళన చేపట్టారు.
ఈ విషయంపై గత కొన్ని రోజులుగా హాస్పిటల్స్ ముందు వారు నిరసన చేపట్టినా.. అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కాగా.. నేడు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తమ ఆందోళనను ఉధృతం చేసింది. రేపు (బుధవారం) ఓపీ విధులను బహిష్కరించాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. స్టైఫండ్ గురించి ప్రకటన చేయకపోతే.. ఎల్లుండి నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా బాయ్ కాట్ చేయనున్నట్లు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
Naga Chaitanya: విడాకులు, ఎఫైర్ రూమర్స్ పై చైతూ మాట్లాడతాడా?
