NTV Telugu Site icon

AV Ranganath: హైడ్రా పై ఎమ్మెల్యేల కామెంట్స్.. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు..

Av Ranganath

Av Ranganath

AV Ranganath: హైడ్రా పై కామెంట్ చేసిన ఎమ్మెల్యేల కామెంట్స్ పై నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో చెరువుల కబ్జా ప్రధాన సమస్యగా మారిందన్నారు. దాదాపు చెరువులు 60 శాతం కబ్జా కు గురయ్యాయని తెలిపారు. కొన్ని చోట్ల 80 శాతం చెరువు స్థలం కబ్జా కు గురయ్యిందన్నారు. ఇది ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి అధ్వానంగా మారుతుందన్నారు. చెరువులు నాళాలు కబ్జా కాకుండా చూసుకోవడమే హైడ్రా లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలు కూల్చివేయడం హైడ్రా ముఖ్య ఉద్దేశమన్నారు. రానున్న రోజుల్లో హైడ్రా కు సెపరేట్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రజలు ఎఫ్టిఏల్ బఫర్ జోన్ లో స్థలాలు కొనకూడదన్నారు.

Read also: Yadagirigutta: భక్తులకు శుభవార్త.. విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం..

ఎవరైనా బఫర్ జోన్ లో నిర్మాణాలు చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు బఫర్ జోన్ లో నిర్మించిన వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ప్రతి రోజూ హైడ్రాకు 100 కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. హైడ్రా పై కామెంట్ చేసిన ఎమ్మెల్యేల కామెంట్స్ పై నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. లే ఔట్ల పేరుతో చెరువులు కబ్జా చేసిన వారిలో ఎక్కువగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే అన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కుపైగా ఉన్నాయని తెలిపారు. హైడ్రా చెరువులను ప్రధానంగా తీసుకుందని తెలిపారు. NRSC డాటా ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనమరుగయ్యాయని వ్యాఖ్యానించారు. చాలా చెరువులు 60 శాతం, కొన్ని చెరువులు 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామన్నారు.

Read also: CM Revanth Reddy: అంతర్జాతీయ యువజన దినోత్సవం.. రాష్ట్ర యువతకు సీఎం శుభాకాంక్షలు

చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.2500 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందన్నారు. ప్రజల నుంచి హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఫిర్యాదులపై మా వంతు ఎంత చేయాలో అంత చేస్తామన్నారు. దశల వారీగా హైడ్రా పనిచేస్తుందన్నారు. ఆక్రమణలను అడ్డుకోవడం మొదటి దశలో హైడ్రా చేసే పని అన్నారు. హైడ్రా రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ అని తెలిపారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాననీటిని మళ్లించి పునర్జీవనం కల్పించడం అన్నారు. గొలుసుకట్టు చెరువులన్నీంటిని పునరుద్దరిస్తామన్నారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలన్ని పూడుకుపోయాయని తెలిపారు.

Read also: MLC Kavitha: కవితకు నో బెయిల్‌.. విచారణ ఆగస్టు 20 కి వాయిదా..

అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయి. చెరువు ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ లో ఎవరు స్థలాలు కొనుగోలు చేయవద్దన్నారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమదనం చేస్తామన్నారు. పార్కు స్థలాలను పరిరక్షించేందుకు ముందుకొచ్చే కాలనీ సంఘాలను సమర్థిస్తామన్నారు. పార్క్ స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలు సహకరిస్తున్నామని తెలిపారు. బస్తీ వాసుల ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలన్నారు. నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదన్నారు. చందానగర్ లో గతేడాది బఫర్ జోన్ లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారన్నరు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవన్నారు. క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని తెలిపారు.

Read also: IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై హైకోర్టులో పిటిషన్‌..

బఫర్ జోన్ , ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. హైడ్రా కు సుమారుగా 3500 మంది స్టాఫ్ అవసరం ఉందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కు ఎక్కువ మంది స్టాఫ్ అవసరం ఉంది.. హైడ్రాలో వివిధ జోన్లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం.. ప్రభుత్వం కుండా హైడ్రా కు చాలా సపోర్ట్ చేస్తుంది.. ఇప్పటికే 200 కోట్లు నిధులు కూడా కేటాయించింది..పార్క్ స్థలాలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ స్థలాలకు LRS, BRS రేగులరెైజేషన్ జరగదన్నారు.
Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదు.. 10 కోట్లు కేటాయింపు..