IAS Bhavesh Mishra: తెలంగాణలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో ప్రసవించారు. నిన్న సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధారణ డెలివరీ చేయడం సాధ్యం కాలేకపోయిందని సూపరిండెంట్ తెలిపారు. హాస్పటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్లు శ్రీదేవి,లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఇలా త్రిపాఠి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు 3.400కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. జిల్లా కలెక్టర్ భవ్యష్ మిశ్రా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆసుపత్రి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు డాక్టర్ల పెంపు గురించి వైద్య అధికారులతో చర్చిస్తూ రాష్ట్రస్థాయి అధికారులకు తెలియపరుస్తూ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను ప్రారంభించారు.
Read also: Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర
అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సక్రమంగా చేయరని, నార్మల్ డెలివరీ చేయడం కోసం నిండు గర్భణీలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వం ఆసుపత్రులపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో.. ఒక కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రి బిడ్డకు జన్మనివ్వటంపై సర్వత్రా ప్రసంసలు వెల్లు వెత్తుతున్నాయి. కలెక్టర్ అంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయించి ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకుండా ఓరేంజ్ లో హడావుడి వుండకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో తన భార్యను డెలివరీ చేయించడం పై కలెక్టర్ అంటే ఇలా వుండాలంటూ ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు. తన భార్యనే కాదు అక్కడున్న నిండు గర్భణీలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ధైర్యంగా వచ్చి నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Telangana Wether: మళ్లీ వానలు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..