Site icon NTV Telugu

సింగరేణి ప్రమాదంపై స్పందించిన సీఎండీ శ్రీధర్‌

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సింగరేణిలో జరిగిన ప్రమాదంపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ స్పందించారు. ఎస్‌ఆర్‌పీ-3,3ఎ ఇంక్లైన్‌ ప్రమాదంలో కార్మికుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా సింగరేణి ఉంటుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గని ప్రమాద మృతులకు కంపెనీ ద్వారా చెల్లించే సొమ్ము తక్షణమే అందించారు. మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్యాట్యూటీ మొదలైనవి కలిపి 70 లక్షల నుండి కోటి రూపాయల వరకూ చెల్లించినట్లు తెలిపారు.

Exit mobile version