NTV Telugu Site icon

Hyderabad Traffic: సిటీ ట్రాఫిక్‌పై సీఎం సీరియస్‌..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Hyderabad Traffic: మహానగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌పై దృష్టి సారించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, ఇతర శాఖల అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, మెట్రోరైలు, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారుల సలహాలు, సూచనలతో నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించేందుకు పోలీసు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

Read also: KCR: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..! ఏ రోజంటే..?

గతేడాది ఆగస్టులో జరిగిన 64వ కన్వర్షన్ సమావేశానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా రోడ్ల ఆక్రమణలు, పార్కింగ్, రద్దీగా ఉండే రోడ్లపై ప్రత్యామ్నాయ మార్గాలు, అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణం, చెత్త డంపింగ్ వంటి ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యే అంశాలపై చర్చించారు. రోడ్ల విస్తరణకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై ఆక్రమణలు తొలగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. నీటిపనులు, విద్యుత్‌ పనులు జరుగుతున్న తరుణంలో రోడ్డు తవ్వకం, పూడికతీత పనులపై దృష్టి సారిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.
Hanuman: ఆ రేంజ్ ఫుట్ ఫాల్స్ ఈమధ్య కాలంలో చూడలేదు…