Site icon NTV Telugu

CM Revanth Review: సీఎం రేవంత్ విద్యుత్ అధికారులతో సమీక్ష.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు

Revanthreddy Telangana Cm

Revanthreddy Telangana Cm

CM Revanth Review: సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్ సిఎండి గోపాల్ రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నతాధికారులు ఇస్తున్నారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే వున్న ప్రభాకర్ రావు ఈరోజు రివ్యూకు హాజరు కాలేదు. దీంతో సీఎం ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలుపాలని అన్నారు. నిన్నటి నుంచి విద్యుత్ శాఖ అంశం పై సీఎం సీరియస్ గా వున్నారు. 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల రాజీనామా చేశారని తెలిపారు. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదం తెలపవద్దని సమీక్షకు ఆయన్ను కూడా పిలవాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

Read also: Most Expensive Cake : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్.. ధర వింటే మైండ్ బ్లాకే..!

అయినా కూడా ప్రభాకర్ రావు సమీక్షకు హాజరు కాలేదు. ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. అయినా సమీక్షకు గైర్హాజరు కావడంతో సీఎం ఏవిధంగా స్పందించనున్నారు అనేదానిపై స్పష్టత రానుంది. మరోవైపు ఆర్టీసీ శాఖలపై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్ వాణి ప్రసాద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఈడీలు, ఉన్నతధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం సెక్రటేరియట్ కు సీఎం రేవంత్, పలువురు మంత్రులు సహా ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఆర్టీసీ తరువాత విద్యుత్ శాఖపై రివ్యూ నిర్వహించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ అంశంపై ఆర్టిసి ఎండి సజ్జనార్ తో చర్చించారు సీఎం. ఇప్పటికే కర్ణాటక వెళ్లి ఉచిత ప్రయాణంపై ఆర్టిసి అధికారుల అధ్యయనం చేశారు.
Mizoram New CM: మిజోరం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన లాల్‌దుహోమా

Exit mobile version