Site icon NTV Telugu

Tummala: సత్తుపల్లిలో ఫుడ్ పార్క్.. ఫిబ్రవరిలో ప్రారంభించేది ఆయనే..

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Tummala: సత్తుపల్లి మండలంలో వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల‌ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు మేగా ఫుడ్ పార్క్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల‌ నాగేశ్వరరావు పరిశీలించారు. మన ప్రాంతంలో పండే అన్ని పంటలకు స్టోరేజ్ చేసుకోవాటానికి ఫుడ్ పార్క్ ను స్థాపించామన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులు పండించే పంటకు డిమాండ్ పెరుగుతుందన్నారు. రైతుకు మేలు జరగాలి అంటే స్టోరేజ్ కు రావాలన్నారు. అన్ని దేశాలు కూడా మన దేశం కేళ్ళి చూస్తున్నాయన్నారు. పంటను దాచుకొని యే విధంగా ఎక్స్ ఫోర్ట్ చేయ్యాలి యే సమయంలో చేయాలి అనే దానితో రైతులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. పామాయిల్ విత్తనాలు కోసం ఇతర దేశాల నుండి తీసుకు రాకుండా మన దేశంలో మన రాష్ట్రం లో మన జిల్లా లోనే ప్రాసెసింగ్ ప్రారంబిస్తామన్నారు. వచ్చే నెలలో ఫుడ్ ఫార్క్ ను సి.ఎం.రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభిస్తామన్నారు.

Read also: Bandi sanjay: కేటీఆర్‌ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు

ముందుగా మామిడి ప్రాసెసింగ్ ప్రారంభించాలన్నారు. రైతులకు మేలు జరగాలి అంటే మంచి విత్తనాలు కావాలన్నారు. రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయి…అక్కడ స్క్రీన్ లు ఏర్పాటు చేసి రైతు వేదిక ద్వారా సైన్ టిస్ట్ లతో మాట్లాడే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. అప్పుడు రైతులు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ప్రతి విషయాన్ని రైతు వేదికలను ఉపయోగంలోకి తీసుకొని శాస్త్ర వేత్తల ద్వారా వ్యవసాయాన్ని ముందుగా తీసుకు వెళ్తానని అన్నారు. రైతులు ఆర్ధికంగా నిలబడాలన్నారు. పుడ్ ఫార్క్ ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశించారు. మన‌ పంటలను చూసి మీగతా జిల్లాలో ఫాలో కావాలన్నారు. భవిష్యత్తు లో ఆయిల్ ఫాం రైతులకు మంచి రోజులు రావాలన్నారు. రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అవ్వాలని తెలిపారు.
Cannabis Chocolates: రామాంతపూర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు.. ఆందోళనలో గాంధీనగర్ వాసులు

Exit mobile version