Site icon NTV Telugu

CM Revanth Reddy: పది రోజులు సీఎం రేవంత్ బిజీ.. ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్..!

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీ వెళ్లిన అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్లి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. నాలుగైదు రోజులు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ… వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు భారత్ నుంచి క్రమం తప్పకుండా హాజరవుతారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.

Read also: Uttam Kumar Reddy: వేసవిలో రాష్ట్రంలో చెరువుల పూడిక.. వానాకాలం లోపు పూర్తవ్వాలి..

తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు, లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎంవో కార్యదర్శులు, ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం ఈ నెల 23న హైదరాబాద్‌కు రానుంది. ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు కావస్తోంది. హడావిడి షెడ్యూల్ తో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో తెలంగాణను నిర్లక్ష్యం చేయకూడదని భావించారు. దావోస్ అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులో తెలంగాణ ప్రతినిధులు ప్రతిసారీ పాల్గొంటారు. ఈసారి మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో వెళ్లాలన్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ.. పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
Kangana Ranaut: కంగనా రనౌత్ పెళ్లి చేసుకునేది ఇతన్నేనా?

Exit mobile version