CM Revanth Reddy: పది రోజులు సీఎం రేవంత్ బిజీ.. ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీ వెళ్లిన అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్లి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. నాలుగైదు రోజులు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ… వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు భారత్ నుంచి క్రమం తప్పకుండా హాజరవుతారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
Read also: Uttam Kumar Reddy: వేసవిలో రాష్ట్రంలో చెరువుల పూడిక.. వానాకాలం లోపు పూర్తవ్వాలి..
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు, లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎంవో కార్యదర్శులు, ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం ఈ నెల 23న హైదరాబాద్‌కు రానుంది. ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు కావస్తోంది. హడావిడి షెడ్యూల్ తో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో తెలంగాణను నిర్లక్ష్యం చేయకూడదని భావించారు. దావోస్ అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులో తెలంగాణ ప్రతినిధులు ప్రతిసారీ పాల్గొంటారు. ఈసారి మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో వెళ్లాలన్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ.. పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
Kangana Ranaut: కంగనా రనౌత్ పెళ్లి చేసుకునేది ఇతన్నేనా?
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!