CM Revanth Reddy: నేడు ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ధర్మపురి జన జాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభకు సీఎం హాజరుకానున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఉప్పల్ లో సాయంత్రం రేవంత్ రెడ్డి రోడ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు గమనించాలని సూచించారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బంది పడకుండా.. వేరే మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సహకరించాలని కోరారు.
Read also: prasannavadanam Twitter Review : సుహాస్ ‘ప్రసన్న వదనం ‘ హిట్టా? ఫట్టా?
ఇక ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని చెప్పి కేంద్రం తెలంగాణకు గాడిదను ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడినందుకే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగవని రేవంత్ హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల కుల గణన చేస్తున్నాం. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతాం. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ అన్నారు. 1881 నుండి, దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తున్నారు. 2021లో జనాభా గణన జరగాల్సి ఉన్నా.. అమిత్ షా కుట్ర చేసి అడ్డుకున్నారు. బంజరు భూముల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మోడీ, కేసీఆర్‌లు పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్‌కు చేసిందేమీ లేదని రేవంత్ మండిపడ్డారు.
prasannavadanam Twitter Review : సుహాస్ ‘ప్రసన్న వదనం ‘ హిట్టా? ఫట్టా?