Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు అంబర్‌పేట్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ లో సీఎం పర్యటన

Reventh Reddy

Reventh Reddy

CM Revanth Reddy: రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలంతా ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. రాష్ట్రంలోని మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను పీసీసీ ప్రకటించింది. నేటి నుంచి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం చేస్తారు.

Read also: Sabarimala: రోజుకు 80 వేల మందికే శబరిమల అయ్యప్ప దర్శన భాగ్యం

రేపు (ఈ నెల 7వ) తేదీ ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సీఎం పాల్గొని నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. వెంటనే రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 8న సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొని జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభలో, సాయంత్రం 6 గంటలకు ఎల్ బీ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జన జాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జన జాతర సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు.
Pragya Jaiswal : అప్పుడు చేజారిన అవకాశం..ఇన్నాళ్లకు మళ్ళీ వచ్చింది..

Exit mobile version