Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు వరంగల్‌ లో సీఎం రేవంత్‌ పర్యటన..

Revatnh Reddy

Revatnh Reddy

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరంగల్ పార్లమెంటరీ ప్రాంతంలో రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇవాళ మూడోసారి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తరఫున ప్రచారం చేసేందుకు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వరంగల్ మండిబజారు వద్దకు వస్తారు. అక్కడ ముస్లిలంతో కలిసి మండిబజారు దర్గాలో ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరుతారు. పోచమ్మమైదన్ లోని సాయిబాబా మందిరంలో పూజలు చేస్తారు. పోచమ్మ మైదాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.

Read also: Rathnam : ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అక్కడి నుండి సాయంత్రం 6.30 గంటలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు. పోచం మైదాన్ నుండి హనుమకొండ వేయిస్తంభాల గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా హనుమకొండ చౌరస్తాకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మడికొండ, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో జరిగిన జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని క్యాడర్ పార్టీ మ్యానిఫెస్టోకు దిశానిర్దేశం చేసి వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలో జరిగే రోడ్ షోలలో పాల్గొంటారని సందేశం ఇచ్చారు. ఇవాళ నియోజకవర్గాలు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో సీఎం స్థాయి నేత మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా.. కడియం కావ్య గెలుపును రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం.
Telangana Rains: రాష్ట్రంలో భిన్న వాతావరణం.. 19 జిల్లాల్లో వానలకు ఛాన్స్‌

Exit mobile version