NTV Telugu Site icon

Alai Balai Program: మాట నిలబెట్టుకున్నారు.. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించిన దత్తాత్రేయ..

Cm Revanth Reddy Speech At Alai Balai 2024

Cm Revanth Reddy Speech At Alai Balai 2024

Alai Balai Program: వస్తా నని చెప్పి.. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ అన్నారు. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించారు. సీఎం ఆత్మ విశ్వాసంతో ఎదిగిన వ్యక్తి అన్నారు. జడ్పీటీసీ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఎదిగారన్నారు. అలయ్ బలయ్ కి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అనంతరం సీఎం రేవంత్ నీ దత్తాత్రేయ సన్మానించారు. సీఎంకు గొంగడి .. కర్ర బహుకరించారు. వేదిక మీదున్న గవర్నర్ లు.. బీజేపీ నేతలకు గొంగడి కర్ర బహుకరించారు.

దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం అలయ్ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. హర్యానా కి గవర్నర్ ఐనా..తెలంగాణ బిడ్డను నేను అన్నారు. చేతివృత్తులు ఈ అలయ్ బలయ్ లో ప్రదర్శించామన్నారు. వాటిని కాపాడుకోవాలని ఆలోచన ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం లు పరస్పర అవగాహన తో పని చేయాలన్నారు. అన్నీ రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని, ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్ళాలని తెలిపారు.

Read also: Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అందరితో గౌరవింపబడే వ్యక్తి దత్తాత్రేయ అన్నారు. అలయ్ బలయ్.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిందన్నారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు.. అలయ్ బలయ్ స్ఫూర్తి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో.. రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం లేకుండే అన్నారు. అలయ్ బలయ్ తెలంగాణ సంప్రదాయాల వేదిక అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేదన్నారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఎనర్జీ ఉండాలన్నారు. అలయ్ బలయ్.. గ్రామీణ సంస్కృతి నీ ప్రదర్శిస్తుందని తెలిపారు. ఐక్యత కి వేదిక అన్నారు. తెలంగాణ కల్చర్ ఏందో అందంగా ఉందని తెలిపారు. త్రిపుర లో కూడా విజయ దశమి చేస్తామన్నారు.

Read also: TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు?

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. అలయ్ బలయ్ ఆంధ్రలో కూడా పెట్టండని కోరారు. రాయలసీమ లో ఒకసారి యుద్ధం ప్రకటిస్తే.. అంతే అన్నారు. అందుకే అక్కడ ఆంధ్రలో కూడా అలయ్ బలయ్ పెట్టాలని తెలిపారు. రాయల సీమలో కల్చర్ మారాలి.. కొట్టుకోవడం పోవాలన్నారు. దతన్న పేరు..అలయ్ బలయ్ దత్తన గా పేరు మార్చాలని కోరారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అలయ్ బలయ్ గొప్ప విషయం అన్నారు. తెలంగాణ రాజకీయాలు అనేక మార్పులు చేర్పులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల ఎప్పుడు ఘర్షణ పడొచ్చు.. తమ ఏజెండా ప్రజలకు చెప్పుకోవచ్చన్నారు. ఎన్నికల తర్వాత బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు ముఖ్యం అని తెలిపారు. నాయకుల ప్రసంగాల్లో భాషలో మార్పులు రావాలన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్న విధానాలు ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో విమర్శించుకుందామన్నారు. కానీ ప్రజలు అసహ్యించుకునే లాగా మాట్లాడకండి అని సూచించారు. మోడీ తరపున తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Rajendra Nagar: రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్..