NTV Telugu Site icon

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలుకు మీరే మా సారథులు.. అధికారులతో సీఎం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమావేశమాయ్యారు. రాష్ట్ర పరిపాలన, శాంతి భద్రతలతో అధికారులకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు జోడెద్దుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ‘అధికారులకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేము. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లదే. ప్రజా పాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి.

నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉండి సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే అద్దాలమేడలు రంగుల గోడలు కాదు. కుల గోడలు చూపించి అభివృద్ధి అని చూపించే ప్రజలను మభ్యపెట్టకూడదు. అట్టడుగు వర్గంలో ఉన్న పేదవాడికి చివరి వరసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులది’ అని పేర్కొన్నారు. అక్రమార్కులకు అవినీతి పరులను భూ కబ్జా దారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని అధికారులకు పిలుపినిచ్చారు. ‘అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. కబ్జాదారులు, రక్ష సరఫరాదారులపై కటినంగా వ్యవహరించాలి. భూ కబ్జా అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో సన్ బర్న్ నిర్వహణపైన పోలీసులు నిగా పెట్టి అసలు విషయం తేల్చాలి.కొన్ని ఈవెంట్స్ భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలిగేలాగా నిర్వహిస్తున్నాయి.. వాటిపైన చర్యలు తీసుకోవాలి.

సన్ బర్న్ ఈవెంట్స్ ను మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు నిషేధించాలి. వీటి వెనకాల ఎవ్వరు ఉన్న వదిలిపెట్టకండి. గంజాయి పై కఠినంగా పోలీసులు వ్యవహరించాలి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలి. గంజాయి విస్తరణ కాలేజీలో చేరింది. పోలీసులు వీటిపై చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా నిగా పెట్టాలి నిబంధనలో అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలను కొన్ని కార్పొరేట్ వ్యవస్థలే అమ్ముతున్నాయి ఇలాంటి వాళ్లను లిస్టు తయారుచేసి ఉక్కు పాదం పెట్టాలి. గ్రామ సభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యేలాగ వినిపించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే మా లక్ష్యం. పనిచేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సిఎస్ డీజీపీకి చెప్పి తమ బాధ్యతలనుంచి తప్పుకోవచ్చు. బాధ్యత తీసుకున్న ప్రతి అధికారి పూర్తిస్థాయిలో తమ బాధ్యతను నిర్వర్తించాల్సిందే’ అని అన్నారు.