NTV Telugu Site icon

CM Praja Darbar: ప్రజాభవన్ కు చేరుకున్న సీఎం రేవంత్.. క్యూ కట్టిన ప్రజలు

Revanth Reddy Cm

Revanth Reddy Cm

CM Praja Darbar: జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరగనుంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు. వినతులతో ప్రజాదర్బార్ లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా వచ్చారు. ప్రజాభవన్ లో ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించనున్నారు.

Read also: Earthquake : తమిళనాడు, కర్ణాటకల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఈరోజు జ్యోతిరావ్ ఫూలే అంబేద్కర్ ప్రజాభవన్ (ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీ పైన కూడా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇవాళ మార్గదర్శకాలపై చర్చించనున్నారు.
కాగా, ఎన్నికల సమయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై ప్రత్యేక దృష్టి సారించింది. మధ్యాహ్నం సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు సీఎన్‌డీ ప్రభాకర్‌రావు తప్పకుండా హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సంస్థలో రూ.85 వేల కోట్ల అప్పులపై ఆరా తీస్తారు. ఈరోజు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ తొలి కేబినెట్ సమావేశంలోనే వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Yash 19: టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది… దీని కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయించావా అన్న?

Show comments