NTV Telugu Site icon

CM Revanth Reddy: 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన.. మెగాస్టార్ పై రేవంత్..

Cm Revanth Reddy Megastar Chiranjeevi

Cm Revanth Reddy Megastar Chiranjeevi

CM Revanth Reddy: మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవి అదే తపన ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత ఇప్పుడు కూడా చిరంజీవి అదే తపన ఉందని తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరపడం రాష్ట్ర ప్రభుత్వం భాధ్యత అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తోందన్నారు. దేశంలో హిందీ తరువాత తెలుగు ఎక్కువగా మాట్లాడుతారని తెలిపారు. తెలుగు అంతరించి పోతుందనే అనుమానం వస్తున్న సమయంలో ఇలాంటి అవార్డులు ఇవ్వటం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. సాంప్రదాయాలను కొనసాగించేందుకు ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.

Read also: Hyderabad MMTS: నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

వెంకయ్య నాయుడు, చిరంజీవి మమ్ములను అభినందిస్తుంటే మా ప్రజా పాలనకు పునాదులు పడ్డాయి అని భావిస్తున్నా అన్నారు. ప్రతీ ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25లక్షల క్యాష్ రివార్డ్ ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. వెంకయ్య నాయుడు, చిరంజీవి చేతుల మీదుగా ఇప్పుడే ఇస్తున్నామని.. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతీ నెలా 25వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. భాషను కాపాడాలంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాన్ని కాపాడాలని తెలిపారు. ప్రజల తరపున పోరాటం చేస్తే గుర్తింపు, హోదా దక్కుతుందని అన్నారు. యువత తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి…అప్పుడే దేశాన్ని ప్రపంచ స్థాయి పోటీలో ముందు వరుసలో ఉంటుందని, దేశం నలుమూలల రోడ్డు మార్గాన, ఎక్కువ సభల్లో పాల్గొన్న నాయకుల్లో వెంకయ్య నాయుడు ఉంటారన్నారు. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారు అనుకున్నా – భవిషత్ లో రాష్ట్రపతి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో తెలుగు నాయకత్వం తగ్గుతున్నట్టు అనిపిస్తోంది…వచ్చే ఎంపి ఎన్నికల్లో మంచి నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.


Harish Rao: ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్‌ రావుతో ఆటో డ్రైవర్లు