Hyderabad MMTS: నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad MMTS: హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. నేటి 4వ తేదీ (ఆదివారం) నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్-సిర్పూర్-కాగజ్‌నగర్, వికారాబాద్-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్ ప్రకారం నిలిపివేస్తారు.
Read also: Harish Rao: ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్ రావుతో ఆటో డ్రైవర్లు
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
అందుబాటులోకి రానున్న మరో టెర్మినల్..
హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్‌ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సనత్ నగర్ – మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను దాటుకుని కొన్ని రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని వివరించారు.
Telangana Govt: పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!