Site icon NTV Telugu

CM Revanth Reddy: అందెశ్రీ ఆకస్మిక మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Rr

Rr

CM Revanth Reddy: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Read Also: Tamannaah special song: తెలుగులో మరో ఐటమ్ సాంగ్‌లో తమన్నా

ఇక, తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… అందెశ్రీ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌. ఈ సందర్భంగా అందెశ్రీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రెటరీకి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version