CM Revanth Reddy : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరం అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ముఖ్యంగా, మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణానికి భూమి అవసరమని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.
Viral: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన మరో ముఖ్యమైన అంశం రాజీవ్ రహదారి విస్తరణ. హైదరాబాద్-కరీంనగర్-రామగుండంలను కలిపే ఈ రహదారిలో, ప్యాకేజీ జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని వివరించారు. వీటితో పాటు, తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం వెంట పలువురు తెలంగాణ ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాజ్ నాథ్ సింగ్‌తో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.
Delhi: షోరూమ్ ఫస్ట్‌ఫ్లోర్‌లో నిమ్మకాయ తొక్కిస్తుండగా కిందపడ్డ ఖరీదైన కారు.. ఆ తర్వాత ఏమైందంటే..!
