Site icon NTV Telugu

CM Revanth Reddy: యశోదలో వెంకట్‌రెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

Komati Reddy Revanth Reddy

Komati Reddy Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వెంకట్ రెడ్డిని పరామర్శించారు. వెంకట్ రెడ్డి గత కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ఆస్పత్రికి వెళ్లి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మంత్రి కూడా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read also: BJP: నేడు బీజేపీ కీలక సమావేశాలు.. శాసన సభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం..!

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన ఆయన గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నల్గొండ అంటే కోమటిరెడ్డిగా జిల్లాలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాజాగా ఆయన నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొంతకాలంగా గొంతు సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అయితే మరోసారి ఇబ్బంది రావడంతో హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి వెంకట్ రెడ్డిని పరామర్శించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆస్పత్రికి వచ్చిన మంత్రిని పరామర్శించారు. మంత్రి వెంకట్ రెడ్డి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లారు.
Rafael Nadal: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న రాఫెల్ నాదల్‌!

Exit mobile version