NTV Telugu Site icon

CM Revanth Reddy: ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తాం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటామని సీఎంతెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే… విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప కేటగిరీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అయితే ఈనేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి ని మాదిగ ఎమ్మెల్యేలు, మంత్రులు దామోదర రాజనర్సింహ, కడియం శ్రీహరి, కవ్వంపల్లి, వేముల వీరేశం,శామ్యూల్ శాలువా కప్పి సన్మానించారు. స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Read also: Supreme Court: ‘మహిళతో ఇలా ప్రవర్తించినందుకు సిగ్గు లేదా?’..బిభవ్ పై సుప్రీంకోర్టు ఫైర్

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గాని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గాని.. ఏ బి సి డి వర్గీకరణ మీద మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ.. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే.. నాతోపాటు ఆనాటి శాసనసభ్యులు సంపత్ కుమార్ ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగిందని గుర్తుచేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది బీఆర్‌ఎస్‌ అన్నారు. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజా ప్రభుత్వం కోర్టులో వాదన వినిపించిందని తెలిపారు. రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఏడు మంది చర్చిలలో.. ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫుననే స్పష్టమైన ప్రకటన చేస్తున్న దేశంలోనే అందరికంటే ముందుభాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తామన్నారు.

Read also: Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా

ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటామని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందన్నారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామన్నారు.

Damodar Raja Narasimha: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..

Show comments