NTV Telugu Site icon

CM Revanth Reddy: కాంగ్రెస్​ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్​

Pocharam Srinivas Revamth Reddy

Pocharam Srinivas Revamth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. దీంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. అనంతరం పోచారం నివాసానికి కాంగ్రెస్​ ఎంపీ బలరాం నాయక్​, కాంగ్రెస్​ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. అలాగే పోచారంను సీఎం రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Read also: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్‌పై స్టే విధించిన కోర్టు..

ఈ నేపథ్యంలోనే నేడో, రేపో పోచారం కాంగ్రెస్ లో చేరతారనే చర్చ సాగుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రివర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.అయితే సీఎం రేవంత్​ రెడ్డి మాజీ స్పీకర్​ నివాసానికి వెళ్లారనే విషయం తెలియగానే పోచారం నివాసానికి బాల్క సుమన్​, బీఆర్​ఎస్​ నేతలు వెళ్లారు. పోచారం నివాసం వద్ద బీఆర్​ఎస్​ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు బీఆర్​ఎస్​ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!