NTV Telugu Site icon

Salaar Song: సలార్‌ సాంగ్‌ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌

Revanth Reddy

Revanth Reddy

Salaar Song: డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ లో ప్రభాస్ కట్ అవుట్ చూడటానికి అభిమానులు ఆశక్తి చూపుతున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కత్తందుకుని ఊచకోత కోయటాన్ని ఆయన అభిమానులు చొక్కాలు చింపుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మరో హీరో పృథ్వీరాజ్, ప్రభాస్ మధ్య స్నేహం గురించి సాగే సూరిడే గొడుగు పట్టి అనే పాట సినిమా కంటే ముందే విడుదలై మంచి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే పాట.. ఆ పాటలోని ఇంటెన్సిటీ.. లిరిక్స్‌లోని డెప్త్ అలాంటిది. ఈ పాటను పొలిటికల్ లీడర్స్ కి తగ్గట్టుగా ఎడిట్ చేసి.. వారి అభిమానులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే.. ఈ పాట ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనసు దోచుకుంది.

Read also: Lakhbir Singh Landa : లఖ్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్.. పలు క్రిమినల్ కేసులు నమోదు

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డికి.. అపూర్వ స్వాగతం లభించింది. కాగా, ఆ సభకు వెళ్లినప్పుడు తనకు లభించిన గౌరవాన్ని, రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో సాలార్ సాంగ్ పెట్టడం విశేషం. ఆ పాటతో కూడిన వీడియో పెట్టడమే కాదు.. ఆ పాటకు కొన్ని లిరిక్స్ కూడా రాశారు రేవంత్ రెడ్డి. “వేగమొకడు… త్యాగమొకడు.. గతము మరువని గమనమే, ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే.. సైగ ఒకరు… సైన్యం ఒకరు.. కలిసి కదిలితే కదనమే..” ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు అందరూ ఆశక్తిగా చూస్తూ దానికి కామెంట్ చేస్తూన్నారు. డార్లింగ్ ప్రభాస్ అంటే సీఎంకు కూడా అభిమానమే మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Show comments