Salaar Song: సలార్ సాంగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar Song: డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ లో ప్రభాస్ కట్ అవుట్ చూడటానికి అభిమానులు ఆశక్తి చూపుతున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కత్తందుకుని ఊచకోత కోయటాన్ని ఆయన అభిమానులు చొక్కాలు చింపుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మరో హీరో పృథ్వీరాజ్, ప్రభాస్ మధ్య స్నేహం గురించి సాగే సూరిడే గొడుగు పట్టి అనే పాట సినిమా కంటే ముందే విడుదలై మంచి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే పాట.. ఆ పాటలోని ఇంటెన్సిటీ.. లిరిక్స్‌లోని డెప్త్ అలాంటిది. ఈ పాటను పొలిటికల్ లీడర్స్ కి తగ్గట్టుగా ఎడిట్ చేసి.. వారి అభిమానులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే.. ఈ పాట ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మనసు దోచుకుంది.
Read also: Lakhbir Singh Landa : లఖ్బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్.. పలు క్రిమినల్ కేసులు నమోదు
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డికి.. అపూర్వ స్వాగతం లభించింది. కాగా, ఆ సభకు వెళ్లినప్పుడు తనకు లభించిన గౌరవాన్ని, రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో సాలార్ సాంగ్ పెట్టడం విశేషం. ఆ పాటతో కూడిన వీడియో పెట్టడమే కాదు.. ఆ పాటకు కొన్ని లిరిక్స్ కూడా రాశారు రేవంత్ రెడ్డి. “వేగమొకడు… త్యాగమొకడు.. గతము మరువని గమనమే, ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.. ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన.. వెరసి ప్రళయాలే.. సైగ ఒకరు… సైన్యం ఒకరు.. కలిసి కదిలితే కదనమే..” ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎం చేసిన ట్వీట్ ఇప్పుడు అందరూ ఆశక్తిగా చూస్తూ దానికి కామెంట్ చేస్తూన్నారు. డార్లింగ్ ప్రభాస్ అంటే సీఎంకు కూడా అభిమానమే మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే#HaiTaiyarHum #Congress #Nagpur pic.twitter.com/kJBSShjC8j— Revanth Reddy (@revanth_anumula) December 29, 2023
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!