CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ ప్రారంభం..
  • ఒకప్పుడు లారీలో వెళ్లి సినిమాలు చూసేవాడినన్న సీఎం రేవంత్..
  • అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలని ఆకాంక్షించిన సీఎం..
Allu Arjun And Revanth Reddy

Allu Arjun And Revanth Reddy

హైదరాబాద్ కోకాపేటలో అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయికి ఎదగాలని.. హాలీవుడ్‌ను సైతం ఆకర్షించేలా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందని.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఇప్పటికే తన ముద్ర వేశారు. ఇకపై ఆయన లక్ష్యం హాలీవుడ్ స్థాయిని అందుకోవాలి. అక్కడి సినిమాలతో పోటీపడేలా ఆయన భవిష్యత్ ప్రయాణం ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

Also Read:IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!

ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి తన వ్యక్తిగత సినిమా అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు థియేటర్లలో సినిమాలు చూసేందుకు లారీల్లో ప్రయాణించిన రోజులను నెమరువేసుకున్న ఆయన.. నేడు టాలీవుడ్ ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా రంగాన్ని కూడా అత్యంత ముఖ్యమైన పరిశ్రమగా ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

Also Read:Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..

హైదరాబాద్ నగరంలో హాలీవుడ్ స్థాయి షూటింగ్‌లు జరిగేలా ఇక్కడి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అల్లు కుటుంబం అత్యాధునిక హంగులతో మల్టీప్లెక్స్‌ను నిర్మించడంపై అభినందనలు తెలియజేస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులు హైదరాబాద్ సినిమా కళావైభవాన్ని మరింత పెంచుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.