CM Revanth Reddy: తెలంగాణ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం.. ప్రారంభించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth reddy: అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పట్నం మహెందార్ రెడ్డి, తెలంగాణ ఫైర్ శాఖ డిజి నాగిరెడ్డి, హోం ప్రనిస్పల్ సెక్రెటరీ జితేందర్, సౌమ్య మిశ్రా ఇతరఅధికారులు, ఫైర్ సిబ్బంది పాల్గొననున్నారు.
Read also: Crime: ఆర్టీవో కార్యాలయం సమీపంలో మారణాయుధాలతో దాడి
Also Read
ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం లేకపోవడం మంచిది కాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివృది చెందుతుందన్నారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరం అభివృద్ధిలో చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రాజకీయాలు కు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలు ను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ను త్వరలో తీసుకోస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకు రాబోతున్నామన్నారు.
Read also: Pindam : ఆ రెండు ఓటీటీలలో పిండం మూవీకి సూపర్ రెస్పాన్స్..
హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామమన్నారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతామన్నారు. అర్బన్ తెలంగాణా, రూరల్ తెలంగాణా ను అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మ సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్నారు. ఫార్మ్ సిటీలో మీరు ప్లాన్ చేస్తే మేము పల్లె లో ప్లాన్ చేస్తున్నామని, 10 నుండి 15 విలేజ్ లో ఫార్మ్ ను ప్లాన్ చేస్తున్నామన్నారు. ఒకే ప్రాంతము 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని, అపోహాలకు ఎవరు లోను కాకండని సూచించారు. రాజకీయంగా నాకు అవగాహన ఉంది, నిర్మాణంలో నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. మేము అంతకు మేము అపర మేధావులు అని నిర్ణయాలు తీసుకోబోమన్నారు. అలా నిర్ణయాలు తీసుకుంటే.. మేడి గడ్డ అవుతుందన్నారు. పరిపాలన పై నాకు కొంత సమయం కావాలి, ఎవరు కుడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తాదన్నారు.
Ravichandran Ashwin: అభిమానులకు శుభవార్త.. అశ్విన్ వచ్చేస్తున్నాడు!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?