NTV Telugu Site icon

CM Revanth Reddy: డల్లాస్ లో సీఎం రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీపై చర్చ..

Dallas In Cm Revanthreddy

Dallas In Cm Revanthreddy

CM Revanth Reddy: ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

Read also: Minister Sridhar Babu: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యం.. కామ్‌కాస్ట్‌ కంపెనీతో మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు..

హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

Read also: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని డల్లాస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి, నేటి ప్రపంచంలో గాంధీ ఆశయాలు, బోధనల ఔచిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలు, పెట్టుబడులు కోరుతున్న అమెరికన్లతో సమావేశమయ్యారు. న్యూయార్క్ నుండి డల్లాస్ చేరుకున్నారు. టెక్సాస్‌లోని ప్రముఖ భారతీయులతో కలిసి సీఎం, మంత్రులు విగ్రహానికి పూలమాల వేసి స్థానికులతో కలిసి ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు.
Sajjanar: కండ‌క్టర్ ను విధుల నుంచి అందుకే తొలంగించాం.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్‌