Site icon NTV Telugu

CM Revanth Reddy: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు- ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

Rr

Rr

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌యారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్ లోని ఎన్టీయార్ గార్డెన్ దగ్గర జ‌రిపిన సంబ‌రాల్లో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయ‌కులు, కార్యకర్తలు, అభిమానుల‌తో క‌లిసి కేక క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఇక, ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్.. హుస్సేన్ సాగ‌ర్ తీరాన సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ప్రసాద్ ను మంత్రి జూప‌ల్లి అభినందించారు.

Exit mobile version