Site icon NTV Telugu

CM Revanth Reddy : ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం ద్వారా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ, తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కలిగిందని సీఎం రేవంత్ చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా బతుకమ్మను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానం, కష్టసుఖాలను పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని ముఖ్యమంత్రి వివరించారు. ఎంగిలిపూల నుండి సద్దుల వరకూ, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటలతో పండుగ వైభవంగా జరగాలని, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గౌరమ్మను సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు.

చేపలు తినడంతో గుండె నుండి మెదడు వరకు ఆరోగ్య రక్ష అని తెలుసా ?

Exit mobile version