Site icon NTV Telugu

CM Revanth Reddy : వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రైతులు లాభపడే విధంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళావేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు సర్టిఫికెట్లు, లైసెన్సులు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ కాదు.. పండగ కావాలన్నారు. రైతు లాభపడాలి.. రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యుడికి అన్యాయం చేసినట్టే అవుతుంది అని అన్నారు.

Protest: ఇంటిని శుభ్రం చేయమంటే.. ఎంత పని చేసిందో తెలుసా….

దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. “2047 విజన్ డాక్యుమెంట్ కోసం మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రజలను భాగస్వామ్యులను చేసేలా చట్టాలు రూపొందిస్తాం” అని చెప్పారు. “మాకు ప్రత్యేక సైన్యం లేదు.. మీరే మా సైన్యం” అని రేవంత్ అన్నారు. రాజులు యుద్ధాలు చేసినా, కొమరం భీం చేసిన సాయుధ పోరాటం కూడా భూమి కోసం, భుక్తి కోసం జరిగిందని ఆయన గుర్తుచేశారు. “కన్నతల్లి మీద ఎంత ప్రేమ చూపిస్తామో, భూమిపై కూడా అంతే ప్రేమ చూపించాలి. భూములు లాక్కోవాలని చూసిన ప్రతీసారి తిరుగుబాట్లు వచ్చాయి. ధరణి చట్టం కొద్దిమంది దొరలకు చుట్టం అయ్యింది. ధరణి దోపిడీ నుండి మొన్న జరిగిన ఎన్నికలతో ప్రజలు విముక్తి పొందారు” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?

Exit mobile version