CM Revanth Reddy: పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుసగా భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీపై రేవంత్ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది.
Read also: BJP MP K. Laxman: మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారు..
బీఆర్‌ఎస్ నుంచి పార్టీలోకి వస్తున్న కొత్త వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాని సొంత పార్టీ నేతల నుంచి ఎంపీ టిక్కెట్ విషయంలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఎంపీ టికెట్ దక్కని వారిని కార్పొరేషన్ బుజ్జగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానంతో ఈ అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో లోక్‌సభ అభ్యర్థులపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది. మరో ఆరు ఖాళీల భర్తీకి మంత్రివర్గ విస్తరణ పూర్తి కానుంది.
Medaram Jathara: మరో రెండ్రోజుల్లో మహాజాతర.. భక్తులతో కిక్కిరిసిన మేడారం