Site icon NTV Telugu

CM Rvanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు

Mahila Shakthi Canteen

Mahila Shakthi Canteen

CM Rvanth Reddy: రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్‌ సర్వీసెస్‌’ ఏర్పాటుకు సీఎస్‌ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్‌ సేవలు’ ఏర్పాటు చేస్తున్నామని సీఎస్‌ శాంతికుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహిళా సంఘాల నిర్వహణకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామికవాడల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో అన్నా క్యాంటీన్లు, బెంగాల్ లో దీదీ క రసోయ్ పేరుతో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేశామని వివరించారు.

Read also: Sanjjanaa Galrani: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన నటి సంజన..

వచ్చే రెండేళ్లలో కనీసం 150 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామ సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వాటి ఏర్పాటుకు ఎంత స్థలం కావాలి, వాటి ఏర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ను సీఎస్‌ ఆదేశించారు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పంచాయతీరాజ్‌, సచివాలయంలో క్యాంటీన్‌ ఏర్పాటుపై సమీక్షా సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కర్ణన్‌, దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, పర్యాటక శాఖ డైరెక్టర్‌ నిఖిల, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ రమేష్‌ నాయుడు తదితరులు హాజరయ్యారు.
Love Me : ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ మూవీ..

Exit mobile version