Gadari Kishore : హైదరాబాద్‌లో మరో రాజకీయ కలకలం రేగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండిస్తూ గాదరి కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను వ్యక్తిగతంగా దూషణలకు గురయ్యానని ఎంపీ సీఎం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిశోర్‌కు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
Sam Pitroda: ‘‘పాకిస్తాన్ వెళ్లాను, ఇంట్లో ఉన్నట్లు ఉంది’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడు..
