Site icon NTV Telugu

CM KCR Wishes Adivasis: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. సీఎం శుభాకాంక్షలు

Cm Kcr Wishes Adivasis

Cm Kcr Wishes Adivasis

CM KCR Wishes Adivasis: నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, ముహర్రం సందర్భంగా తెలంగాణ సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఆదివాసీయులందరికి ప్రభుత్వం అండగా వుంటుందని పేర్కొన్నారు. మానవీయ సంబంధాలకు మమతాను రాగాలకు కల్మశం లేని ఆదివాసీలు ప్రతీకలని సీఎం వ్యాఖ్యానించారు. ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమం కోసం స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేసారు. మా తండాలో మా రాజ్యం అనే ఆదివాసి గిరిజన ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు.

read also: National Flags Distribution: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ

ఈ నేపథ్యంలో.. గిరిజనులకు గురుకులాల ద్వారా అత్యున్నతస్థాయి విద్యను, అంబేడ్కర్​ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కాగా.. గిరిజన గూడాలకు, తండాలకూ విద్యుత్​, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా.. కుమురం భీం స్మారక మ్యూజియంతో పాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా, రాంజీ గోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు.

భాగ్యనగరంలోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. అంతేకాదు, ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధిని అందిస్తూ.. గిరి బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ వారి వ్యాపారాభివృద్ధికీ ప్రభుత్వం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఈరోజు మస్లీములు జరుపుకుంటున్న బీబీకా ఆలం (మొహర్రం) పండుగ సందర్భంగా.. సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

Yogi Adityanath: యోగిని మూడు రోజుల్లో హతమారుస్తాం..

Exit mobile version